నాకే ఊపిరి ఆడని పరిస్థితి -విజయసాయిరెడ్డి

by srinivas |
నాకే ఊపిరి ఆడని పరిస్థితి -విజయసాయిరెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో: విమ్స్‌ను ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. మంగళవారం విమ్స్‌లో కరోనా బాధితులను విజయసాయిరెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘విమ్స్ ఆస్పత్రి ప్రారంభంలో చాలా విమర్శలు వచ్చాయి. 12 ఐసీయూ వార్దులున్నాయి. 10 ఐసోలేషన్ వార్డులున్నాయి. కరోనా వల్ల డాక్టర్స్, ఫారామెడికల్ సిబ్బంది కొరత ఉంది. నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ విధుల్లో హాజరుకావడానికి మొగ్గు చూపడం లేదు. కరోనా రోగులతో మాట్లాడినప్పుడు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వంలో విమ్స్‌ని ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నం చేశారు. ఎప్పటికీ విమ్స్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. రాబోయే నాలుగేళ్లలో మరింతగా అభివృద్ధి చేస్తాం. గంట సమయం పీపీఈ కిట్ వేసుకుంటే నాకే ఊపిరి ఆడని పరిస్థితి. వైద్యుల సేవ మరువలేనిది’ అంటూ ఆయన కొనియాడారు. విమ్స్ డైరెక్టర్ వరప్రసాద్, సిబ్బందికి విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed