‘విక్రమ్’ ఫస్ట్ లుక్.. యాక్టింగ్ లెజెండ్‌ Vs ప్రజెంట్ జనరేషన్ ఎక్స్‌పోనెంట్స్

by Shyam |   ( Updated:2021-07-10 06:29:31.0  )
Vikram First Look
X

దిశ, సినిమా: ‘మాస్టర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. లోకనాయకుడు కమల్ హాసన్‌తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ నిర్మిస్తున్న ‘విక్రమ్’ మూవీ ఫస్ట్ లుక్‌ రిలీజ్ చేసిన లోకేశ్.. మరో బ్లాక్ బస్టర్ కన్‌ఫర్మ్ అనిపించేశాడు. యాక్టింగ్ లెజెండ్ కమల్‌తో కలిసి కరెంట్ జనరేషన్ యాక్టింగ్ ఎక్స్‌పోనెంట్స్ విజయ్ సేతుపతి, ఫాహద్ ఫజిల్ స్క్రీన్‌పై హిస్టరీ క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుండగా… ఒకే సారి ముగ్గురి క్యారెక్టర్స్‌కు సంబంధించిన ఇంటెన్స్ లుక్స్ రిలీజ్ చేసి వావ్ అనిపించారు. ముగ్గురు స్టార్ హీరోల ఫ్యాన్స్‌‌ను కూడా సర్‌ప్రైజ్ చేసిన ఈ లుక్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మూడు పవర్ హౌజ్ పర్ఫార్మెన్స్‌లు థియేటర్స్‌ను దద్దరిల్లేలా చేస్తాయంటున్న అభిమానులు.. కాంబినేషన్ గురించి వర్ణించేందుకు మాటలు చాలడం లేదంటున్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story