కరోనా వ్యాక్సిన్ త్వరగా రావాలి: విజయసాయిరెడ్డి

by srinivas |
కరోనా వ్యాక్సిన్ త్వరగా రావాలి: విజయసాయిరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: నేడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎంపీ, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కరోనాతో అల్లాడిపోతున్నారని, ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ త్వరగా రావాలని శ్రీవారిని తాను కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ఆపద సమయంలో కూడా శ్రీవారి దర్శనాలు కల్పిస్తున్నారని, ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ధన్యవాదాలు అని ఆయన అన్నారు.

Advertisement

Next Story