- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జాకే మోదీకో బోలో!!!

నా భ ర్తను ఎందుకు చంపావని ఓ టెర్రరిస్టును నిలదీస్తే.. వెళ్లి మోదీకి చెప్పుకో పో అంటూ గద్దించాడని బాధితురాలు మీడియా ఎదుట రోదించారు. పల్లవి ఆమె భర్త రెండురోజుల క్రితం కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. దాల్ సరస్సు ను సందర్శించాక పహల్గామ్ ట్రెక్కింగ్ కు వెళ్లారు. అక్కడ ఓ హోటల్ వద్ద దంపతులు ఆగారు. పల్లవి హోటల్ లోనే కూర్చోగా.. ఆమె భర్త ఫోన్ మాట్లాడేందుకు కొద్దిగా దూరం వెళ్లారు. అక్కడికి మిలిట్రీ దుస్తుల్లో ఉన్న వ్యక్తి వచ్చి మాట్లాడారు. ఆ వెంటనే తుపాకీతో తలపై ఒక బుల్లెట్ పేల్చారని పల్లవి మీడియాకు చెప్పింది. వెంటనే తాను అతడి దగ్గరికి వెళ్లి ఎందుకు తన భర్తను చంపావని చొక్కా పట్టుకున్నానని, తనను విదిల్చుకుంటూ వెళ్లి మోదీకి చెప్పుకో పో అంటూ గట్టిగా అరిచాడని ఆమె మీడియాకు వెల్లడించింది. జీవితంలో మధుర క్షణాలు గడుపుదామని కశ్మీర్ కు వస్తే.. తన జీవితాన్ని ఉగ్రవాదులు ఛిన్నాభిన్నం చేశారని ఆమె రోదించడం అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.