పవన్ Vs సేతుపతి..?

by Anukaran |   ( Updated:2020-11-04 07:02:38.0  )
పవన్ Vs సేతుపతి..?
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రకటనతో విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. పవన్ హీరోగా మలయాళీ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చేస్తున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ దసరా రోజున ప్రకటించిన విషయం తెలిసిందే. ఒరిజినల్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజూ మీనన్ మెయిన్ రోల్స్ చేయగా.. పవన్‌తో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోయే మరో హీరో ఎవరనే దానిపై రోజుకో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకు భళ్లాల దేవుడు రానాతో పాటు పవన్ వీరాభిమాని నితిన్ పేర్లు వినిపించాయి. తాజాగా మరో హీరో పేరు తెరమీదకి వచ్చింది. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ పాత్ర చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

పవన్‌తో పాటు మరో పవర్‌ఫుల్ రోల్‌కు విజయ్ సేతుపతి కరెక్ట్ అని ఫిల్మ్ మేకర్స్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా.. పవన్‌తో ఢీకొట్టబోయే నటుడి గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Next Story