లూట్ కేస్‌కు విజయ్ కాంప్లిమెంట్స్

by Anukaran |   ( Updated:2020-08-10 02:31:29.0  )
లూట్ కేస్‌కు విజయ్ కాంప్లిమెంట్స్
X

లూట్ కేస్.. కునాల్ ఖేము నటించిన కామెడీ ఎంటర్‌టైనర్. రాజేష్ కృష్ణన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఆగస్ట్ 2న రిలీజ్ అయింది. డబ్బుతో ఉన్న సూట్ కేస్ మిస్ అవడం.. ఆ సూట్ కేస్ కనుగొనే ప్రయత్నంలో సూపర్ కామెడీని జనరేట్ చేశాడు దర్శకుడు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో నటనకు గాను హీరో కునాల్ ఖేము, హీరోయిన్ రసికా దుగల్‌కు ప్రశంసలు అందుతుండగా.. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మిస్ అయిన నగదు కనుగొనాలనే క్రూరమైన కల నెరవేరినప్పుడు.. ఎంత గందరగోళంగా ఉంటుంది. అందులో ఎంత కామెడీ ఉంటుందనేది ఫుల్ కామెడీ వేలో ప్రజెంట్ చేశారు డైరెక్టర్.

కాగా ఈ సినిమా చూసిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. లూట్ కేస్ కాస్ట్ అండ్ క్రూను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. సినిమా టేకింగ్, రైటింగ్ బాగుందన్న విజయ్.. కునాల్ ఖేముతో పాటు కీలక పాత్రలు చేసిన మిగతా అందరూ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. ముఖ్యంగా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఆర్యన్, ప్రింటింగ్ ప్రెస్ బాస్ యాక్టింగ్ అదిరిపోయిందని చెప్పాడు. టోటల్‌గా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ లెంగ్త్ కామెడీతో కడుపుబ్బా నవ్వించారన్నారు విజయ్. దీనిపై స్పందించిన కునాల్ విజయ్‌కు థాంక్స్ చెప్పాడు.

https://twitter.com/TheDeverakonda/status/1292695225383575552?s=19

Advertisement

Next Story