- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, వెబ్ డెస్క్:‘దొరసాని’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరో ఆనంద్ దేవరకొండ. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీ కి పరిచయమైనా విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొంటున్నాడు ఆనంద్. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ తర్వాత ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్పక విమానం’. విజయ్ దేవరకొండ సమర్పణలో ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో దామోదర అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇక నేడు ఆనంద్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలోని మొదటి సింగిల్ ని విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేస్తూ ఆనంద్ కి విషెస్ తెలియజేసాడు. “సిలకా ఎగిరిపోయావా ..”అంటూ సాగే ఈ పాటను రామ్ మిరియాల సంగీతం అందిస్తూ మరో సింగర్ ఆనంద్ గుర్రంతో కలిసి ఆలపించారు. పాట ఆద్యంతం హీరోయిన్ గురుంచి హీరో ఆలోచిస్తూ పాడుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ వీడియోలో మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ ఫుల్ జోష్ లో డాన్స్ లు వేస్తూ కనిపించారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది. మరి ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ మరో హిట్ ని అందుకుంటాడేమో చూడాలి.