మీలాంటి జోకర్స్‌ను చూసేందుకు బతికే ఉన్నాం: నయన్ శివన్

by Jakkula Samataha |   ( Updated:2020-06-22 04:17:41.0  )
మీలాంటి జోకర్స్‌ను చూసేందుకు బతికే ఉన్నాం: నయన్ శివన్
X

కోలీవుడ్ క్రేజీ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్‌లకు కరోనా పాజిటివ్ వచ్చిందని కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు ప్రచారమయ్యాయి. ఇద్దరికీ కొవిడ్ -19 సంక్రమించగా చికిత్స పొందుతున్నట్లు రూమర్లు వచ్చాయి. కాగా దీనిపై స్పందించిన ఈ జంట.. ఓ వీడియోను షేర్ చేస్తూ ఫేక్ న్యూస్‌కు చెక్ పెట్టారు. ‘కరోనాతో చనిపోయామని సోషల్ మీడియాలో వైరల్ అయిన మా ఫొటోస్ అద్భుతంగా డిజైన్ చేశారు.. కానీ మేము బతికే ఉన్నాం.. ఆరోగ్యంగా.. ఆనందంగా ఉన్నాం’ అని చెప్పారు.

ఈ సందర్భంగా నయన్, శివన్‌లు.. బేబీ షార్క్ వీడియోపై డ్యాన్స్ చేస్తున్న వీడియో షేర్ చేశారు. బుల్లి నయన్, బుజ్జి శివన్ డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ కాగా.. దేవుడి దయ వల్ల మేమిద్దరం క్షేమంగానే ఉన్నామని చెప్పారు. మీలాంటి జోకర్స్‌ను చూసేందుకు దేవుడు మమ్మల్ని సంతోషం, శక్తితో ఆశీర్వదించాడని చెంప చెళ్లుమనిపించే సమాధానం ఇచ్చారు. ‘కొవిడ్ -19 ఇన్ని అద్భుతాలు చేస్తుందనుకోలేదు’ అంటూ ఫేక్ న్యూస్‌పై సెటైర్ వేశారు శివన్ నయన్‌లు.

https://twitter.com/VigneshShivN/status/1274766726761033728?s=19

Advertisement

Next Story