- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుక్కర్‌లో వంట త్వరగా ఎందుకు అవుతది..? ఎప్పుడైనా ఆలోచించారా..?
దిశ, వెబ్ డెస్క్: చాలామందికి ఈ విషయంలో డౌట్ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకు ఈ ప్రశ్న అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటుంది. ఆహారం విడిగా వండినప్పటికంటే కుక్కర్ లో వండినప్పుడు త్వరగా పూర్తవుతుంది.. ఎందకు అని వారి మెదడులో కదులాడుతూ ఉంటుంది. కారణం ఆహారపదార్థాలను ఉడికించడానికి మనం నీరు లేక నూనెను వాడుతాము. నీరైనా, నూనైనా మరిగి ఆవిరయ్యే స్థితికి వచ్చినప్పుడు వాటిలో వేసిన ఆహార పదార్థాలు ఉడికిపోతాయి. అయితే, మూతల్లేని పాత్రలో వంట చేసినప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రత కావాలి. దీనికి కారణం చుట్టూ ఉన్న వాతావరణం ఒత్తిడి.
ఈ ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు మరిగేందుకు ఎక్కువ వేడి కావాలి. ఒత్తిడి తక్కువ ఉంటే తక్కువ వేడితోనే మరగడం జరుగుతుంది. కుక్కర్ లో వండినప్పుడు వాతావరణ ఒత్తిడి ఆహారపదార్థాలపై ఉండదు. దాంతో మరిగే ఉష్ణోగ్రత తగ్గి తక్కువ సమయంలోనే ఆహారం ఉడుకుతుంది.
విజిల్ వచ్చినప్పుడు నీటి ఆవిరి బయటకుపోయి కుక్కర్ లోపల ఒత్తిడి తగ్గుతుంది. కుక్కర్ మూతను తాకి కొంత నీటి ఆవిరి నీరుగా మారడం వల్ల కూడా ఒత్తిడి తగ్గిపోతుంది. ఈ కారణాల వల్ల మరిగే ఉష్ణోగ్రత తగ్గి వంట త్వరగా కావడమే కాదు.. ఇంధనం కూడా ఆదా అవుతుంది.