- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నోరూరించే ఫిష్ బుర్జీ తయారీ విధానం.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా చేపలతో.. చేపల పులుసు, వేపుడు, ఇగురు వంటి అనేక రకాల వంటకాలు చేస్తుంటారు. చేపలతో చేసే వంటకాలు ఎంతో రుచిగా ఉండటమే కాకుండా, మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే చేపలతో తరచూ చేసే వంటకాలతో పాటు చేపల పొరటును కూడా తయారు చేసుకోవచ్చు. దీనినే ఫిష్ బుర్జీ అని అంటారు. ఈ ఫిష్ బుర్జీని ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ ఇదే వంటకం చేసుకోవాలనిపిస్తుంది. కాగా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫిష్ బుర్జీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫిష్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు- అరకిల, తగినంత ఆయిల్, ఆవాలు- అర టీ స్పూన్ , రెండు రెమ్మల కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి పేస్ట్- ఒక టీ స్పూన్, పసుపు- అర టీ స్పూన్, తరిగిన 3 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి- అర టీ స్పూన్, చివర్లో వేసుకోవడానికి సరిపడ కొత్తిమీర తీసుకోవాలి.
ఫిష్ బుర్జీ తయారీ విధానం:
ముందుగా ఫిష్ ముక్కలకు ఉప్పు, పసుపు వేసి కలపాలి. కలిపిన తర్వాత అరగంట పాటు పక్కకు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. తర్వాత అందులో ఫిష్ ముక్కలను వేసి దానిపై మూత పెట్టి 18 నిమిషాలు ఉంచాక.. వీటిని ప్లేట్‌లోకి తీసుకుని వాటిపై ఉండే చర్మాన్ని తీసేయాలి. అనంతరం చేప ముళ్లులను కూడా నెమ్మదిగా వేరు చేయాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి.. వేడి అయ్యాక.. ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేసుకోవాలి. తర్వాత చేప పొరుటు, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి వేసి నెమ్మదిగా కలపాలి. దీనిని 4 నుంచి 5 నిమిషాల పాటు వేయించిన తర్వాత గరం మసాలా వేసి కలపాలి. రెండు నిమిషాలు స్టవ్‌పై అలా ఉంచి.. చివరకు కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక ఈ వేడి వేడి ఫిష్ బుర్జీని అన్నం, చపాతితో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.