ఫ్లాష్ ఫ్లాష్ : హుజురాబాద్‌కు మరో కీలక పదవి.. ‘బీసీ’లు ఎవరివైపు..?

by Anukaran |
cm-kcr
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి ఎప్పుడైతే రాజీనామా చేశారో.. హుజురాబాద్ ప్రాంత ప్రజలు, టీఆర్ఎస్ ముఖ్య నేతలకు బాగా కలిసోచ్చింది. ఎలాగైనా ఉపఎన్నికల్లో గెలిచి పరువు నిలుపుకోవాలని అధికార పార్టీ చూస్తుండగా.. ఈటల మాత్రం ఎందులోనూ తగ్గేది లేదని, కారును ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ ఈటల రాజేందర్‌ను ఇరుకున పెట్టేందుకు భారీ స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది. హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన నాయకునికి మరో కీలక పదవిని కట్టబెట్టింది. వకుళాభరణం కృష్ణమోహన్ రావును ‘బీసీ కమిషన్ ఛైర్మన్’గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు సభ్యులుగా శుభప్రద పటేల్, కె కిషోర్ గౌడ్, బీసీ వెల్ఫైర్ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Next Story