- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వకీల్ సాబ్ ఆగయా..
బాస్ ఈజ్ బ్యాక్.. వకీల్ సాబ్ ఆగయా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చేశాడు. సత్యమేవ జయతే అంటూ చట్టాన్ని కాపాడేందుకు సన్నద్ధం అయ్యాడు. అదే యాటిట్యూడ్, అదే స్వాగ్, అదే అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్ తో వావ్ అనిపించాడు. అభిమానుల అంచనాలను అందుకొని .. ఎస్ దట్ ఈజ్ పవర్ స్టార్ పవర్ అనిపించాడు. వకీల్ సాబ్ గా నల్లకోటు వేసుకొని, ఒక చేతిలో క్రిమినల్ లా బుక్, మరో చేతిలో రూల్ కర్రతో ధర్మాన్ని కాపాడేందుకు.. అధర్మానికి పాల్పడిన వారి తాట తీసేందుకు సూపర్ కటౌట్ తో సూపర్ ఎంట్రీ ఇచ్చాడు. హా.. ఇది కదా మాకు కావాల్సింది అనిపించే లుక్ తో అదరగొట్టేశాడు. మోషన్ పోస్టర్ రిలీజ్ అయిన ఐదు నిమిషాల్లో లక్ష వ్యూస్ దాటేసి.. దటీజ్ పవనిజం అని రుజువు చేశాడు.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వస్తున్న వకీల్ సాబ్ అంచనాలకు మించి ఆకట్టుకుంటుంది అనే విషయం పవన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ తోనే అర్థం అయిపోయింది. హిందీ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం పవన్ మార్క్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని.. రికార్డులు బద్ధలు చేస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. ఇన్ని ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్న పవన్ న్యూ స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్యాన్స్ కు సూపర్ కిక్ ఇవ్వగా.. సోషల్ మీడియా ట్రెండింగ్ మామూలుగా లేదు.