‘వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యం.. డోసులు ఇంకా రాలే ’

by Shamantha N |
‘వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యం.. డోసులు ఇంకా రాలే ’
X

బెంగళూరు : దేశంలో 18 ఏళ్లు నిండినవారికి నేటి నుంచి మొదలుకానున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ తమ రాష్ట్రంలో ఆలస్యమవుతుందని కర్నాటక తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కె.సుధాకర్ శుక్రవారం బెంగళూరులో మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 18+ వారికి మే 1 నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించడం సాధ్యపడదు. పూణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌కు ఒక కోటి కొవిషీల్డ్ డోసుల కోసం ఆర్డర్ ఇచ్చాం. అందుకు గాను రూ. 400 కోట్లు కూడా చెల్లించాం. కానీ వ్యాక్సిన్ డోసులు ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తాయో కూడా వాళ్లు చెప్పడం లేదు’ అని తెలిపారు. మరి వ్యాక్సినేషన్ ఎప్పటినుంచి ప్రారంభిస్తారనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘దీని మీద మాకు కూడా స్పష్టమైన సమాచారం లేదు. వ్యాక్సిన్ డోసులు వచ్చాక మేం వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తాం’ అని చెప్పారు. వ్యాక్సిన్ డోసుల కొరతతో ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాలు మే 1 నుంచి టీకా పంపిణీ లేదని ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed