ఆగస్టులోపు 30 కోట్లమందికి టీకా

by sudharani |
ఆగస్టులోపు 30 కోట్లమందికి టీకా
X

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆగస్టులోపు 30 కోట్ల మంది భారతీయులకు కరోనా టీకా వేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. కరోనాపై పోరులో టీకాతోపాటు మాస్కు, శానిటైజర్లు కీలక ఆయుధాలని పునరుద్ఘాటించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్‌గా కూడా కొనసాగుతున్న కేంద్ర మంత్రి హర్షవర్దన్, ఢిల్లీ ఓల్డ్ రైల్వే స్టేషన్ దగ్గర మాస్కులు, సబ్బులను సోమవారం ఉచితంగా పంపిణీ చేశారు. ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, ‘వచ్చే ఏడాది తొలినాళ్లలో కరోనా టీకా అందుబాటులోకి వస్తుంది. మార్చి, ఏప్రిల్‌లోపు భారతీయులకు టీకా వేసే అవకాశాలున్నాయి. జులై-ఆగస్టుకల్లా 25 నుంచి 30 కోట్ల మంది ప్రజలకు టీకా వేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక. ప్రస్తుతం ఆ ప్లాన్ ప్రకారమే సిద్ధమవుతున్నాం’ అని అన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం అవసరమని, కరోనాపై పోరు ప్రారంభించి 12 నెలలు గడిచినప్పటికీ పాటించాల్సిన జాగ్రత్తలు మాత్రం అవేనని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed