- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రెండుసార్లు మాస్కు లేకుండా కనిపిస్తే.. రూ.10,000 ఫైన్

X
లక్నో: ఉత్తరప్రదేశ్ కరోనా కట్టడి చర్యలను కఠినం చేసింది. ప్రతి ఆదివారం లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమయంలో కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉండనుంది. అలాగే, మాస్కు ధరించకుంటే రూ.10,000 వరకు జరిమానా వేయనున్నట్టు తెలిపింది. మాస్కు ధారణ నిబంధనను తొలిసారి ఉల్లంఘిస్తే రూ. 1000 జరిమానా అని, రెండో సారీ ఉల్లంఘిస్తే రూ.10,000 ఫైన్ వసూలు చేస్తామని స్పష్టం చేసింది. స్కూళ్లను మే 15 వరకు మూసేసిన రాష్ట్ర ప్రభుత్వం బోర్డు ఎగ్జామ్స్‌నూ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 2000కుపైగా యాక్టివ్ కేసులున్న నగరాల్లో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నది.
Next Story