ఆ రెండు పార్టీలు తోడు దొంగలే: ఉత్తమ్

by Shyam |   ( Updated:2021-03-04 02:55:36.0  )
Uttam Kumar Reddy
X

దిశ వెబ్ డెస్క్ : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు, ఐటీఐఆర్ అంశాలపై మాట్లాడారు. ఎన్నిరోజులైనా టీఆర్ఎస్ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కును అడగదు, బీజేపీ ఇవ్వదని ఉత్తమ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఈరెండు పార్టీలు తోడు దొంగలేనని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం కాంగ్రెస్ పోరాటానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఎప్పటికైనా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కాంగ్రెస్సే సాధిస్తుందని అన్నారు.

Advertisement

Next Story