కరోనా పరీక్షలకు రోబోల సాయం?

by sudharani |
కరోనా పరీక్షలకు రోబోల సాయం?
X

దిశ, వెబ్‌డెస్క్:
కరోనా వైరస్ టెస్టులను ముమ్మరం చేయడానికి స్పెయిన్ దేశం రోబోల సాయం తీసుకోవాలనుకుంటోంది. దేశం మొత్తంలో కరోనా పరీక్షలను ఆటోమేట్ చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ పాండమిక్ వ్యాప్తిని కట్టడి చేయడానికి పరీక్షలు వేగంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ క్రమంలో పరీక్షలు చేస్తున్న సిబ్బందికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. వారిని కాపాడే ఉద్దేశంతో రోబోలను రంగంలోకి దించాలని స్పెయిన్ నిర్ణయించింది.

ఇప్పటివరకు స్పెయిన్‌లో 35వేల మంది కరోనా పాజిటివ్ కేసులు ఉండగా వారిలో 12 శాతం మంది హెల్త్ వర్కర్లే. వీరంతా ఏదో ఒక రకంగా కరోనాను పరీక్షించే పనిలో నిమగ్నమైనవారే. రోబోలను ఉపయోగించడం వల్ల హెల్త్ వర్కర్లు కరోనా బారిన పడకుండా కాపాడటమే కాకుండా ఒకరోజులో జరిగే పరీక్షలను నాలుగు రెట్లు పెంచే అవకాశం కలుగుతుంది. రోబోల ద్వారా ఒకరోజులో 80 వేల మందికి కరోనా పరీక్షలు చేసే అవకాశం కలుగుతుందని మాడ్రిడ్ హెల్త్ ఇనిస్టిట్యూట్ హెడ్ రకేల్ యొట్టి వెల్లడించారు. ఓ వైపు రోబోలు పనుల్లోకి వస్తే చాలా మంది ఉపాధి కోల్పోతారని విమర్శలు వస్తున్న తరుణంలో ఇలాంటి ఆరోగ్యపర అవసరాలకు రోబోలను ఉపయోగించాలనుకోవడం నిజంగా హర్షణీయం.

Tags: Corona Virus, COVID 19, Robots, Spain, Health Worker, Madrid, Pandemic, Testing, Corona

Advertisement

Next Story

Most Viewed