కరోనా వ్యాక్సిన్‌పై ట్రంప్ కీలక ప్రకటన..

by vinod kumar |
కరోనా వ్యాక్సిన్‌పై ట్రంప్ కీలక ప్రకటన..
X

దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా వైరస్‌తో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. దాని నివారణకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రపంచమంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. టీకా తయారీలో వివిధ దేశాల శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. అత్యధిక కేసులతో సతమతమవుతున్న అమెరికా, కొవిడ్ వ్యాక్సిన్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. టీకా తయారీలో ముందు వరుసలో ఉన్న యూఎస్ అన్ని దేశాలకు వ్యాక్సిన్‌ను అందిస్తామని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

కరోనా వైరస్‌ నివారణకు సిద్ధం చేస్తున్న టీకాలను అమెరికా ఇతర దేశాలకు సరఫరా చేసే అవకాశాలు లేకపోలేదని డొనాల్డ్‌ ట్రంప్‌ సూచన ప్రాయంగా తెలిపారు. టీకా తయారైన తరువాత దేశవ్యాప్తంగా వేగంగా టీకా ఉత్పత్తి చేపడతామన్నారు. కరోనా చికిత్సకు ఉపయోగపడే వెంటిలేటర్లు సరఫరా చేసినట్లే టీకాను కూడా ఇతర దేశాలకు అందిస్తామని వెల్లడించారు.అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరి నాటికల్లా.. వచ్చే ఏడాది మొదట్లోగానీ టీకా అందుబాటులోకి రావచ్చునని ట్రంప్‌ ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed