బైడెన్ కన్నా ముందే ప్రమాణ స్వీకారం చేయనున్న కమలా హారీస్

by vinod kumar |
బైడెన్ కన్నా ముందే ప్రమాణ స్వీకారం చేయనున్న కమలా హారీస్
X

దిశ,వెబ్‌డెస్క్: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్‌లోని ‘క్యాపిటల్ హిల్’ పశ్చిమ వైపు కార్యక్రమం నిర్వహించనున్నారు. భారతకాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు(అమెరికాలో మ.12 గంటలకు) ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో అమెరికా ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాగా అమెరికా ఉపాధ్యక్షురాలుగా కమలా హారీస్ కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే జోబైడెన్ కన్నా ఆమె ముందుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఇద్దరు నేతలు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed