యూట్యూబ్‌లో ‘ఉప్పెన’ సృష్టించిన పాట

by Shyam |   ( Updated:2020-08-02 08:31:12.0  )
యూట్యూబ్‌లో ‘ఉప్పెన’ సృష్టించిన పాట
X

మరో మెగా వారసుడు ‘వైష్ణవ్ తేజ్’ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఉప్పెన’. ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి అభిమానులను ఆకర్షిస్తూ వచ్చింది. వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇప్పటికే తన క్యూట్ లుక్స్‌తో యువత మనసును ఆకట్టుకుంటోంది. కాగా, ఇందులోని పాటలకు మంచి స్పందన లభించింది. అందులోని ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట విడుదలై నాటి నుంచి యూట్యూబ్‌లో దూసుకుపోతూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఆ పాట 100 మిలియన్ మార్క్‌ను చేరుకుంది.

అతి తక్కువ కాలంలోనే 50 మిలియన్ల వ్యూస్ దక్కించుకుని రికార్డు సాధించినప్పుడే.. ఈ పాట మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకున్నాయి. అనుకున్నట్లుగానే ఈ పాట తాజాగా 100 మిలియన్ జాబితాలో చేరింది. శ్రీమణి, రఖీబ్‌ అలమ్‌ సాహిత్యం అందించిన ఈ పాటకు దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించగా, జావెద్‌ అలీ పాడారు. అయితే ఈ రోజు రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ పుట్టినరోజు కావడం విశేషం. దాంతో మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీకి తన అభిమానులు ఇచ్చిన అపురూప కానుకగా దీన్ని చెప్పుకుంటున్నారు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సన ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం. ఇంతకుముందు అల వైకుంఠపురంలోని మూడు పాటలు 100 మిలియన్ల వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story