భూ భారతి రూల్స్ కరపత్రం రిలీజ్.. అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే..?

by Bhoopathi Nagaiah |   ( Updated:2025-04-16 14:33:08.0  )
భూ భారతి రూల్స్ కరపత్రం రిలీజ్.. అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం భూ భారతి చట్టం రైతులకు చుట్టం చేయాలన్న లక్ష్యంతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. ప్రతి రైతుకు ఈ చట్టంలో ఏం ఉన్నదో తెలుసుకునేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ప్రగతి పథం.. సకలజన హితం.. మన ప్రజాప్రభుత్వం అంటూ కొత్త చట్టంపై విధి విధానాలను సామాన్యుడికి అర్ధమయ్యేలా రూపొందించారు. భూ భారతిలోని కీలకాంశాలు, దాంతో పాటు ప్రతి సెక్షన్ ద్వారా ఏమేం సేవలు అందిస్తారో తెలిపారు. రికార్డుల్లో తప్పొప్పులు, వారసత్వంగా వచ్చిన భూముల మ్యుటేషన్, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం వంటి అన్ని అంశాలను వివరిస్తూ నాలుగు పేజీల కరపత్రాన్ని ఆవిష్కరించారు. వీటిని ప్రతి అవగాహన సదస్సులో రైతులకు అందించేలా ఏర్పాట్లు చేశారు.

ఇదే అప్లికేషన్ ఫారం

భూ భారతి చట్టంతో పాటు గ్రామాల్లో నెలకొన్న తీవ్రమైన సమస్యలను గుర్తించేందుకు నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఈ మండలాల్లో ఆన్ లైన్‌తో పాటు లిఖితపూర్వకంగానూ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ‘దిశ’ బుధవారం ప్రచురించిన ‘పైలెట్ ప్రాజెక్ట్.. పర్ ఫెక్ట్! ముందుగా నాలుగు మండలాల్లో పైలెట్’ అనే కథనంలో పేర్కొన్నట్లుగా లీఫ్స్ సంస్థ చేపట్టిన కార్యక్రమం స్ఫూర్తితోనే నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టులో వినియోగించిన ఫారం మాదిరిగానే ప్రభుత్వం రూపొందించింది. ఇందులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోనున్నారు. సులభతరంగా ఫారాన్ని నింపి అధికారులకు అందించేలా చర్యలు తీసుకున్నారు. పైలెట్ ప్రాజెక్టు మండలాల్లో ఎంత మందికి రైతులకు పాసు బుక్ ఉంది? ఏయే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు? ఎలాంటి భూ సమస్యలు ఉన్నాయి? వంటి అనేక అంశాలతో కూడిన అప్లికేషన్ ఫారాన్ని సిద్ధం చేశారు.

భూ భారతి కరపత్రం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

భూ భారతి అప్లికేషన్ ఫారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి



Next Story

Most Viewed