'ఉప్పెన' ఫస్ట్ వేవ్ ఊపేను!

by Jakkula Samataha |
ఉప్పెన ఫస్ట్ వేవ్ ఊపేను!
X

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమాకు ఫస్ట్ నుంచే బజ్ క్రియేట్ అయింది. ఫస్ట్ లుక్ తో ‘రంగస్థలం’ లోని రామ్ చరణ్‌ను గుర్తుకు తెచ్చిన వైష్ణవ్ … ఫస్ట్ వేవ్ తో ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేశాడు. వైష్ణవ్ కు జోడీగా కృతి శెట్టి నటిస్తున్న చిత్రంతో బుచ్చిబాబు సన డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా… నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. కో ప్రొడ్యూసర్ గా దర్శకులు సుకుమార్ వ్యవహరిస్తున్నారు.

కాగా ‘ఉప్పెన’ ఫస్ట్ వేవ్ .. బేబమ్మా అన్న వైష్ణవ్ పిలుపుతో మొదలవుతుంది. హీరోయిన్ కృతిశెట్టి పేరు బేబి కాగా… దుపట్టా వేవ్ లో బస్ లో వెళ్తున్న హీరోయిన్ ను అందంగా ప్రెజెంట్ చేశారు. కాగా సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed