- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. ఫలితాలు ఈ తేదీల్లో విడుదలయ్యే ఛాన్స్!?

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. ఏపీ(Andhra Pradesh)లో మార్చి 17వ తేదీన పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 1వ తేదీతో పరీక్షలు ముగిశాయి. ఈ క్రమంలో విద్యార్థులు(Students) ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల(ఏప్రిల్) 3వ తేదీన జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 9వ తేదీన మూల్యాంకన ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ 22 లేదా 23న విడుదలయ్యే అవకాశం ఉంది.
బుధవారంతో మూల్యాంకనం పూర్తికాగా, ఫలితాలను కంప్యూటరీకరించే ప్రక్రియ మొదలు పెట్టారు. పలు దఫాల పరిశీలన పూర్తయ్యాక ఫలితాలు ప్రకటించాలని విద్యాశాఖ(Education Department) భావిస్తోంది. త్వరలోనే ఫలితాల విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి కూడా పదో తరగతి పరీక్షా ఫలితాలను bse.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. వెబ్ సైట్‌లోకి ఎంటర్ అయ్యాక విద్యార్ధులు తమ హాల్ టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు. ఇదిలా ఉంటే.. రేపు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రిలీజ్ చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.