ఈనెల 17 వరకు కర్ఫ్యూ పొడగింపు..

by Shamantha N |
ఈనెల 17 వరకు కర్ఫ్యూ పొడగింపు..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. యూపీలో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం యోగీ ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. అయితే, కర్ఫ్యూ ఉన్నప్పటికీ రాష్ట్రంలో కేసులు తగ్గకపోవడంతో.. ఈనెల 17వ తేదీ వరకు కర్ఫ్యూను పొడగిస్తున్నట్టు రాష్ట్ర అడిషనల్ ఛీప్ సెక్రటరీ నవనీత్ సెహగల్ ఓ ప్రకటనలో తెలిపారు. కర్ఫ్యూ ఉన్నందున కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతినిస్తున్నట్టు ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed