- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసోలేషన్ సెంటర్‌లో అసాంఘిక కార్యకలాపాలు.. నర్సుల రాసలీలలు
దిశ, శేరిలింగంపల్లి : కొవిడ్ బాధితుల పట్ల కారుణ్యత చూపించాల్సిన నర్సులు కాఠిన్యత ప్రదర్శిస్తున్నారు. వైద్యం చేయాల్సిన సిబ్బంది అహం ప్రదర్శిస్తూ నోటికి వచ్చిన బూతులు తిడుతున్నారు. పేషెంట్స్‌ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారు మద్యం సేవిస్తూ.. సిగరెట్లు కలుస్తూ రాసలీలల్లో మునిగి తేలుతున్నారు.
ఇదంతా ఎక్కడో కాదు మహానగరంలోని హైదర్ నగర్ డివిజన్‌లోని అడ్డగుట్ట అడ్డాగా సాగుతుందీ తతంగం. కొవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలాషన్ కేంద్రం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ అడ్డగుట్ట ప్రాంతంలోని యోయో హోటల్‌లో డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీ లిమిటెడ్‌కు చెందిన పలువురు ఉద్యోగులకు కరోనా రావడంతో కంపెనీ తరపున కాల్ హెల్త్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చి యోయో హోటల్‌లో ఐసోలాషన్ కేంద్రం ఏర్పాటు చేశారు.
అక్కడ ఇద్దరు డాక్టర్స్, ఇద్దరు నర్సులు డ్యూటీ చేస్తున్నారు. కానీ వారు పేషెంట్స్‌కు సరిగా మందులు, ఇంజెక్షన్స్ ఇవ్వడం లేదని వారిపై ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల కొత్తగా మరో నర్స్‌ను విధుల్లోకి తీసుకున్న కాల్ హెల్త్ సంస్థ అదే హోటల్‌లో డ్యూటీ వేసింది. కానీ ఇప్పటికే అక్కడ డ్యూటీ చేస్తున్న ఇద్దరు నర్సులు రూమ్ నెంబర్ 513లో బీర్లు తాగడం, సిగరెట్ తాగుతూ, మద్యం సేవిస్తూ పేషెంట్లను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. కాల్ హెల్త్‌కు సంబంధించిన సూపర్ వైజర్ నరేష్ డ్యూటీ నర్సులతో విచ్చల విడిగా ఉంటున్నారని, తమ ఎదుటే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ బూతులు మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే కొవిడ్ పేషెంట్స్‌కు వాడిన ఇంజెక్షన్స్, చేతి గ్లౌసెస్, టాబ్లెట్స్, ఇతర వస్తువులను డస్ట్ బిన్‌లో వేయకుండా ఎక్కడ పడితే అక్కడ వేస్తూ కరోనా వ్యాప్తికి కారకులు అవుతున్నారని.. వారితో పాటు పనిచేస్తున్న నర్స్ వనిత మండిపడ్డారు. అక్కడ పని చేసే డాక్టర్లు కూడా నర్సులతో అసభ్యంగా ప్రవర్తించిన సందర్భంలో వనిత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.