- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కస్టమ్స్ సుంకం తగ్గింపుతో బంగారానికి డిమాండ్!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా ప్రభావం కారణంగా 2020లో దేశీయంగా బంగారం దిగుమతులు 80 శాతం తగ్గి 20-25 టన్నులకు పరిమితమైనట్టు ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) తెలిపింది. అలాగే, కేంద్రం 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో బంగారంపై కస్టంస్ సుంకాన్ని 7.5 శాతానికి తగ్గించడం వల్ల అనధికార దిగుమతులు క్షీణిస్తాయని డబ్ల్యూజీసీ తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది విమాన రాకపోకలపై ఆంక్షలు కొనసాగడమే కాకుండా కస్టమ్స్ సుంకం తగ్గింపుతో అక్రమ బంగారం రవాణా తగ్గుతుందని కౌన్సిల్ తన నివేదికలో అభిప్రాయపడింది. బడ్జెట్ ప్రకటనకు ముందు బంగారం 16.26 శాతం పన్నులు ఉండగా, కొత్త పన్ను విధానంతో 2.19 శాతం తగ్గి 14.07 శాతానికి చేరుకుంది. అదేవిధంగా, ఈ ఏడాది బంగారం డిమాండ్ మళ్లీ పుంజుకుంటుందని డబ్ల్యూజీసీ ఆశాభావం వ్యక్తం చేసింది. దిగుమతి సుంకాల తగ్గింపుతో డిమాండ్ ఏర్పడుతుందని, బడ్జెట్లో వెల్లడించిన సంస్కరణల వల్ల పసిడి మార్కెట్‌తో పాటు పరోక్షంగా వివిధ ప్రయోజనాలు కలుగుతాయని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి.