- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరిశ్రమలతో యూనివర్సిటీలను అనుసంధానం చేయాలి
దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్ధుల ఎంటర్ప్రెన్యూర్షిప్ ను డెవలప్ చేసేందుకు పరిశ్రమలను యూనివర్సిటీలతో అనుసంధానం చేసి తోడ్పాటునందించాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. విద్యార్ధులంతా బిజినెస్ ఐడియాస్ ను, ఇన్నోవేషన్ ను సాధించడానికి అవసరమవుతుందన్నారు. టై వర్చువల్ గ్లోబల్ సమ్మిట్ ను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ప్రతి యూనివర్సిటీలో ఇంక్యుబేషన్ కేంద్రం ఉండాలని, వాటి ద్వారానే యువత టాలెంట్ బయటికొస్తుందన్నారు. యూనివర్సిటీ క్యాంపస్ లో ఎంటర్ప్రెన్యూర్స్ ను అభివృద్ధి చేసేందుకు కార్పొరేట్ రంగం కూడా నిధులు ఇవ్వాలని కోరారు. టై వంటి నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ స్టార్టప్ లను ప్రోత్సహిస్తుందన్నారు. సమ్మిట్ 2020 ద్వారా దేశానికి భారీ పెట్టుబడులు రావాలని ఆకాంక్షించారు. దేశంలో యువత పెద్ద సంఖ్యలో ఉన్నారని, వాళ్లలో శక్తి సామర్ధ్యాలు, నైపుణ్యం ఉందన్నారు. ఐతే యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో ఆలోచించాలని సూచించారు.మహిళా ఎంటర్ప్రెన్యూర్ల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. నాస్కాం నివేదిక ప్రకారం కోవిడ్–19 పరిస్థితుల్లోనూ 50 శాతం స్టార్టప్ లు తట్టుకొని నిలిచినట్లు చెప్పారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి మాట్లాడుతూ.. దేశ ఆర్ధిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈ రంగమే వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు. 30 శాతం జీడీపీ వాటి నుంచేనన్నారు. దాన్ని 40 శాతానికి పెంచాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఎంఎస్ఎంఈ రంగం ద్వారా 11 కోట్ల ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. మరో ఐదు కోట్ల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే గ్రామీణ పరిశ్రమలు రూ.80 వేల కోట్ల టర్నోవర్ కలిగిందన్నారు. దాన్ని వచ్చే రెండేండ్లల్లో రూ.5 లక్షల కోట్లకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ.. టై హైదరాబాద్ లో గ్లోబల్ హెడ్ క్వార్టర్ ను ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఛాలెంజెస్ ను అధిగమించినప్పుడు ఎంటర్ప్రెన్యూర్ గా సక్సెస్ కావచ్చునన్నారు. కార్యక్రమంలో యూకే ఇంటర్నేషనల్ ట్రేడ్ మంత్రి రాణిల్జయవార్దెనా, టై హైదరాబాద్ ప్రెసిడెంట్ శ్రీధర్ పిన్నపురెడ్డి, టై గ్లోబల్ బోర్డు ట్రస్టీ మనోహర్ రెడ్డి, టై గ్లోబల్ బోర్డు చైర్మన్ మహవీర్ ప్రతాప్ శర్మ పాల్గొన్నారు.