సీఎంలు కేసీఆర్, జగన్‌కు కేంద్రమంత్రి షెకావత్ లేఖ

by srinivas |
సీఎంలు కేసీఆర్, జగన్‌కు కేంద్రమంత్రి షెకావత్ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లేఖ రారు. రెండు రాష్ట్రాల్లో నిర్మాణంలోని ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే ఇవ్వాలని, అక్టోబర్ 6నాటి అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం అమలు చేయాలని శనివారం ఆయన రాసిన లేఖలో ఆదేశించారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నిర్మాణాలపై పరస్పరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు గతంలో కేంద్రానికి ఫిర్యాదు చేయగా… స్పందించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అక్టోబర్ 6న ఇద్దరు ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులతో అపెక్స్‌ కౌన్సిల్ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ, ఏపీ చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు అనుమతులు తప్పనిసరి అని, కృష్ణా 8, గోదావరిపై 7 ప్రాజెక్టుల డీపీఆర్‌లు తెలంగాణ ఇవ్వాలని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.

Advertisement

Next Story