రేపు విజయవాడకు నిర్మలా సీతారామన్

by srinivas |   ( Updated:2020-10-06 08:38:54.0  )
రేపు విజయవాడకు నిర్మలా సీతారామన్
X

దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం విజయవాడలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.25 గంటలకు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడనుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. గూడవల్లి సర్కిల్ దగ్గర వ్యవసాయ క్షేత్రంలో నేరుగా రైతులతో మాట్లాడనున్న కేంద్రమంత్రి.. మధ్యాహ్నం 3గంటలకు విడిది గృహానికి చేరుకొని కేంద్ర ప్రభుత్వ అధికార కార్యక్రమంలో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు ది వెన్యూ కన్వెన్షన్ హాల్లో వ్యవసాయ బిల్లులపై రైతులు, నిపుణులతో చర్చించనున్నారు.

Next Story

Most Viewed