- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఊహించని షాక్
దిశ, నాగర్‌కర్నూల్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి కచ్చితంగా ఎంపీటీసీల సంఘం తరఫున ఎమ్మెల్సీ బరిలో ఉంటామని సంఘం నాయకులు సుహాసినిరెడ్డి, ఆంజనేయులు ప్రకటించారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఎంపీటీసీల అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలను ఓట్లకు మాత్రమే వాడుకుంటున్నారని.. తరువాత పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. మండలిలో గెలిచిన ఎమ్మెల్సీలు, ప్రభుత్వం.. ఎంపీటీసీల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఇకపై ప్రజాప్రతినిధులు బెదిరించినా మభ్యపెట్టినా భయపడేది లేదని, తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. ఇదే పట్టుదలతో ముందుకు సాగుతామని తీర్మానాలు చేశారు. ఈనెల 18న పోటీలో ఉండే అభ్యర్థి పేరు ప్రకటిస్తామని చెప్పారు. ఏళ్ల తరబడి ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలకు గ్రామాల్లో గుర్తింపు లేకుండాపోయిందని అరకొర నిధులతో ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. వాటి పరిష్కారం కోసమే ఎమ్మెల్సీగా నిలబడి తమ సత్తా ప్రభుత్వానికి తెలియజేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపీటీసీలు బత్తిని తిరుపతిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, చంద్రకళ, రఘుమారెడ్డి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.