- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంబులెన్స్ లేట్.. తోపుడు బండిపై సిలిండర్‌తో మహిళను..
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా లక్షణాలు ఉన్న ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. ఊపిరి ఆడకపోవడంతో ఓ వ్యక్తి సదరు మహిళకు ఆక్సిజన్ సిలిండర్‌తో శ్వాస తీసుకునే వీలు కల్పించాడు.
అనంతరం.. ఆమె కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు కాల్ చేశారు. ఆ సమయంలో దగ్గరలో అంబులెన్స్‌లు ఆ ప్రాంతంలో లేకపోవడంతో మహిళ పరిస్థితి చూసిన ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆ మహిళను తోపుడు బండిపై ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఆ మహిళను పరీక్షించిన వైద్యులు ఆమెకు వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థతి నిలకడగా ఉన్నట్టు తెలిపారు. ఈ ఘటనపై ఉజ్జయిని కలెక్టర్ స్పందిస్తూ.. అత్యసవర సమయంలో ప్రజలు 1075 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.