- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కారులో చనిపోతే జేసీబీతో బయటకు తీసిన్రు
by Anukaran |

X
దిశ, మహేశ్వరం: రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం శ్రీనగర్ ఫ్యాబ్ సిటీ సమీపంలో గురువారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో కారు బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణించే ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు.
మృతులు కందుకూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన వికాస్ రెడ్డి(24), భార్గవ్ రెడ్డి(21)గా గుర్తించారు. ఫ్యాబ్ సీటిలో రేడియంట్ కంపెనీలో విధులు ముగుంచుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి పహడి షరీఫ్ పోలీసులు చేరుకుని జేసీబీ సహాయంతో మృతదేహాలను కారులో బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Next Story