- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముదిరిన వివాదం.. ఒకే గ్రామంలో ఇద్దరు టీఆర్ఎస్ అధ్యక్షులు
దిశ, నకిరేకల్: నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా.. మరోసారి వీరి మధ్య వివాదం తెరపైకి వచ్చింది. అయితే.. టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం మేరకు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే శనివారం నకిరేకల్ నియోజకవర్గం నార్కట్‌పల్లి మండలంలోని లింగోటం గ్రామంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేకు చెందిన రెండు గ్రూపులు గ్రామంలో వేర్వేరు సమావేశాలు జరుపుకొని కమిటీలు ఏర్పాటు చేసి, ఒకే గ్రామానికి ఇద్దరు అధ్యక్షులను ఎన్నుకున్నారు. దీంతో నకిరేకల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయిన విషయం స్పష్టమైంది. పలు గ్రామాల్లో ఇదే మాదిరి ఇష్టానుసారంగా ఎవరికి నచ్చిన వ్యక్తిని వారు ఎన్నుకుంటున్నారు. వీరి విషయంపై హై కమాండ్ పట్టించుకోకపోవడంతో కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.