Viral video : వావ్.. ఈ మోడ్రన్ చిన్ని కృష్ణున్ని చూశారా..? ఎంత ముద్దొస్తున్నాడో..!

by Javid Pasha |   ( Updated:2025-04-08 06:37:42.0  )
Viral video : వావ్.. ఈ మోడ్రన్  చిన్ని కృష్ణున్ని చూశారా..? ఎంత ముద్దొస్తున్నాడో..!
X

దిశ, ఫీచర్స్ : కిట్టయ్య, కన్నయ్య, నల్లనయ్య.. అనే పేర్లు మీరు వినే ఉంటారు. చాలా మంది అవతార పురుషుడిగా, దేవుడిగా కొలిచే శ్రీకృష్ణుడికున్న చిన్ననాటి మారు పేర్లివి. ఇక కృష్ణుడి పేరు వింటేనే చాలా మందికి అతని బాల్య లీలలు సైతం గుర్తుకొస్తాయి. చిన్నప్పుడు అతను ఆవులను మేపడానికి అడవికి తోలుకెళ్లడం, సాయంత్రం తిరిగి తోలుకు రావడం రోజువారి దినచర్యలో భాగంగా ఉండేది. ఇక ఆలమందలు సేదతీరుతున్నప్పుడు స్నేహితులతో కలిసి ఆటలాడుకునేవాడు. ఇలా చిన్ని కృష్ణుడి జీవన విధానమే ఎంతో అద్భుతంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ జీవితంతో ముడిపడి ఉంటుంది. అచ్చం అలాంటి సన్నివేశాల్లో ఒకదానిని గుర్తేచేసే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వైరల్ వీడియో సమాచారం ప్రకారం.. గుజరాత్ రాష్ట్రంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడు వందలాది ఆవులను మేపడానికి తీసుకెళ్తున్నాడు. అయితే అతను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ఆవులన్నీ వెనుకాల నడుస్తూ అతన్ని అనుకరిస్తున్నాయి. అతను పరుగెడితే అవి కూడా పరుగెడుతున్నాయి. అతను మెల్లిగా నడిస్తే అవి కూడా మెల్లిగా నడుస్తున్నాయి. విషయం ఏంటంటే.. అవి ఈ బాలుడు చెప్పినట్లు వింటాయట. పైగా ఇతన్ని విడిచి క్షణం కూడా ఉండలేవట. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పాపం ఆ మూగ జీవాలు ఈ మోడ్రన్ కృష్ణుడిపై ఎంత ప్రేమను పెంచుకున్నాయో.. నిజంగా ఇతను ఆధునిక చిన్ని కృష్ణుడు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఆలస్యమెందుకు మీరూ ఓ లుక్కేయండి!

This Video credits go to saket-reddy beeram thread id



Next Story

Most Viewed