జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

by Sumithra |
జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్
X

జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన శనివారం ఉదయం పుల్వామా జిల్లాలో చోటుచేసుకుంది. అవంతిపొర సెక్టార్‌లోని గోరిపొర ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారని సమాచారం రావడంతో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ముష్కర్లు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరికి సహాయపడిన మరో వ్యక్తి కూడా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరికొంత మంది ఉగ్రవాదులు ఉండొచ్చన్న అనుమానంతో ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు భద్రతా దళాలు.

Tags: encounter, kashmir, pulwama, avanthipora sector

Advertisement

Next Story