- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోర ప్రమాదం: ముగ్గురు మృతి
దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ జాతీయరహదారిపై పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైనట్టు ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ తెలిపారు.
ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం… మూలస్థాన అగ్రహారానికి చెందిన రైతులు కర్రి విష్ణు, ఇనపకోళ్ల శ్రీను, తోరాటి రాంప్రసాద్ లు పొలం పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై రావులపలెం వైపు వెళ్తున్నారు. రాజమహేంద్రవరం వైపు నుండి రావులపాలెం వైపు వెళుతున్న మినీ లారీ… ఆ ముగ్గురు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ఇనపకోళ్ల శ్రీను, కర్రి విష్ణు ఘటనాస్థలంలోనే మృతి చెందగా, తోరాటి రాంప్రసాద్ కు తీవ్ర గాయాలు అవడంతో హైవే అంబులెన్స్ లో రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాంప్రసాద్ కూడా మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పటల్ కు తరలించి.. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివప్రసాద్ తెలిపారు. కాగా మరణించిన ముగ్గురూ ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.