ఉమ్మడి కరీంనగర్‌‌లో కరోనాతో ఇద్దరు మృతి

by Sridhar Babu |   ( Updated:2021-08-04 12:03:29.0  )
ఉమ్మడి  కరీంనగర్‌‌లో కరోనాతో ఇద్దరు మృతి
X

దిశ, మానకొండూరు : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా మానకొండూర్ మండల కేంద్రంలో పదవీ విరమణ పొందిన ప్రధానోపాధ్యాయుడు కొండ్ర కొమురయ్య (62), మండల పరిధిలోని శ్రీనివాస్ నగర్ గ్రామానికి చెందిన కూన సంపత్(45) అను ఇద్దరు వ్యక్తులు కరోనా వ్యాధితో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.

మరణించిన ఇద్దరు వ్యక్తులు ఒకే మండలానికి చెందిన వారు కాగా.. మృతుడు కొమురయ్యకు భార్య, ఒక కూతురు, ఇద్దరు కుమారులు కలరు. మరో మృతుడు సంపత్‌కు భార్య, ఒక కూతురు, ఒక కుమారుడు కలరు. ఇరువురి మృతితో మానకొండూర్, శ్రీనివాస్ నగర్‌లో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.

Next Story

Most Viewed