- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దాతృత్వం చాటుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్..

దిశ, గండిపేట్ : టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలుస్తోందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కిస్మత్ పూర్‌కు చెందిన నరసింహులు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యం కోసం మూడు రోజుల క్రితం నిమ్స్ హాస్పటల్ లో చేరాడు. అతనికి ఆపరేషన్ నిమిత్తం రెండు లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. దాంతో అతని భార్య బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షులు గోకరి సురేష్ గౌడ్ కు తెలిపింది. వెంటనే ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కింద 2 లక్షల చెక్కులను మంగళవారం అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించడం కోసం ప్రభుత్వం సంసిద్ధతతో పని చేస్తుందన్నారు. అందుకే చాలా మందిని సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆదుకోవడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు జగదీష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.