- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జర్నలిస్టులను కాటేసిన కరోనా
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో మంత్రుల మొదలు పాత్రికేయులు, సామాన్యుల వరకు కరోనా బారిన పడకతప్పడంలేదు. తెలంగాణలో ఇప్పటికే వందలాది మంది జర్నలిస్టులు కరోనా బారినపడి కోలుకోగా కొద్దిమంది మరణించారు. తాజాగా వరంగల్‌లో టీ-న్యూస్ సంస్థలో పనిచేస్తున్న పాత్రికేయుడు ప్రవీణ్, సీనియర్ జర్నలిస్టు అయిన జీఎల్ఎన్ మూర్తి కరోనా కారణంగా ఒకే రోజున నగరంలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. నాలుగు పదుల వయసు కూడా దాటని ప్రవీణ్ గాంధీ ఆసుపత్రిలో మృతిచెందగా, సీనియర్ పాత్రికేయులు మూర్తి గోల్కొండ మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కరోనా కారణంగా మనోజ్‌తో పాటు మరికొద్దిమంది జర్నలిస్టులు కూడా చికిత్స పొందుతూ మరణించారు. ఫ్రంట్‌లైన్ వారియర్లుగా పాత్రికేయులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించకపోయినప్పటీ అలాంటి సేవలే నిర్వర్తిస్తున్న వీరు కరోనా కాటుకు బలికావడం బాధాకరం.