- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ రెండు మృతదేహాలు ఎక్కడివి..?
by srinivas |

X
దిశ,విశాఖపట్నం: విశాఖ జిల్లా కశింకోట మండలం గవినిపేట ఏలేరు కాలువలో గుర్తు తెలియని బాలిక, మరో మహిళ మృతదేహాలు సోమవారం సాయంత్రం లభ్యమైయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి కశింకోట పోలీసులు వచ్చి మృతుల వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఆ రెండు మృతదేహాలు తల్లి కూతురుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలో ఎటువంటి అధారాలు లేకపోవడంతో మృతుల వివరాల కోసం పోలీసులు విస్తృతంగా ఆరా తీస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేశామని కశింకోట ఎస్సై సురేష్ కుమార్ తెలిపారు.
Next Story