మనుషులకు బంగారు నాలుకలు.. 2500 ఏళ్లనాటి సమాధులే సాక్ష్యం

by Shyam |
Tombs
X

దిశ, ఫీచర్స్ : ఈజిప్టులోని మిన్యా గవర్నరేట్‌లో సైతే రాజవంశం (664 BC-525 BC)కు సంబంధించిన రెండు సమాధులను స్పానిష్ ఆర్కియాలజికల్ మిషన్ కనుగొంది. ఈ విషయాన్ని కైరోలోని పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బార్సిలోనా యూరివర్సిటీ చేపట్టిన మిషన్‌కు సంబంధించి ఒక సమాధిలో బంగారు నాలుకలతో ఉన్న ఇద్దరు అపరిచిత వ్యక్తుల అవశేషాలను కనుగొన్నట్లు సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యాంటిక్విటీస్ సెక్రటరీ జనరల్ ముస్తఫా వజీరీ వెల్లడించారు.

సమాధి లోపల సున్నపురాయితో తయారుచేసిన శవపేటిక ఒక మహిళ రూపంలో కప్పబడి ఉందని, దాని పక్కనే మరో గుర్తు తెలియని వ్యక్తి అవశేషాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ సమాధిపై ప్రాథమిక అధ్యయనాలు పూర్తి చేసిన తర్వాత, దీన్ని పురాతన కాలంలోనే తెరిచినట్లుగా వజీరీ తెలిపారు. ఇక పూర్తిగా మూసివున్న రెండో సమాధిని ఈ మిషన్‌లో భాగంగా జరిపిన తవ్వకాల్లో మొదటిసారిగా తెరిచారు. ఈ విషయాన్ని వివరించిన ఎక్స్‌కావేషన్ డైరెక్టర్.. మిషన్ రెండో సమాధిలో మానవ ముఖం మంచి సంరక్షణ స్థితిలో ఉందని, ఇక రెండు శవపేటికలతో పాటు అదనంగా కానోపిక్ కుండలు ఉన్నాయని తెలిపారు.

ఒక కుండలో సిరామిక్ మెటీరియల్‌‌తో చేసిన 402 ఉషబ్తి బొమ్మలు(ఫైయన్స్), చిన్న తాయెత్తులతో పాటు ఆకుపచ్చ పూసలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ఫారోనిక్ సమాధులు, విగ్రహాలు, శవపేటికలు, మమ్మీలు సహా ఈజిప్ట్‌లోని వివిధ ప్రాంతాల్లో అనేక పురావస్తు ఆవిష్కరణలు వెలుగు చూడటం విశేషం.

Tombs

Advertisement

Next Story

Most Viewed