- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయేషా మీరా హత్యకేసులో ట్విస్ట్..
దిశ, ఏపీ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆయేషా మీరా హత్య కేసులో అనుమానితులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. ఈ హత్యకేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీబీఐ అనుమానితులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ సీబీఐ విజయవాడలోని నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.
హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు సతీష్, హాస్టల్లో ఆయేషాతో ఉన్న స్నేహితురాళ్లు మెుత్తం ఏడుగురుకు నార్కో ఎనాలసిస్ పరీక్షించాలని సీబీఐ విజ్ఞప్తి చేసింది. వారి సమాచారం ఈ కేసులో అత్యంత కీలకమని పేర్కొంది. ఈ పిటిషన్‌పై బుధవారం మెట్రోపాలిటన్ కోర్టులో విచారణ జరిగింది. అనుమానితుల తరపున న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం సీబీఐ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఇకపోతే కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో 2007 డిసెంబరు 27న ఆయేషా మీరా హత్యకు గురైన సంగతి తెలిసిందే.