- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తగ్గిన టీవీఎస్ అమ్మకాలు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజ తయారీ సంస్థ టీవీఎస్ వాహనాల విక్రయాలు ఫిబ్రవరిలో 17 శాతం తగ్గాయని కంపెనీ వెల్లడించింది. అంతర్జాతీయంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి ఒక కారణమైతే, ఇండియాలో బీఎస్-4 వాహనాలు బీఎస్-6కు మారడం మరో కారణమని సంస్థ ప్రకటించింది. జనవరి నెలలో టీవీఎస్ మొత్తం 2,99,353 యూనట్లను విక్రయించిందని, ఇదివరకే ఉన్న ప్రణాళిక ప్రకారం బీఎస్-4 యూనిట్లను తగ్గించనున్నట్టు ప్రకటించింది. ఉత్పత్తి అయిన బీఎస్-4 వాహనాలన్నిటినీ ఈ నెల చివరిలోగా విక్రయించనున్నట్టు తెలిపింది. కరోనా వ్యాప్తితో విడిభాగాల సరఫరా క్షీణించిందని, ఆ ప్రభావం కంపెనీలకు ప్రతికూలంగా మార్చాయని వివరించింది.
కరోనాను ఎదుర్కునేందుకు, తగిన నిర్ణయాలు తీసుకునే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సంస్థ వెల్లడించింది. ఇక, టీవీఎస్ వాహనాల విక్రయాలు ఫిబ్రవరి నెలలో మొత్తం 2,35,611 యూనిట్లు అమ్ముడుపోయాయని కంపెనీ తెలిపింది. ఇది గతేడాది ఫిబ్రవరితో పోల్చుకుంటే సుమారు 17.3 శాతం తగ్గిందని సంస్థ వెల్లడించింది. దేశీయంగా టీవీఎస్ విక్రయాలు 26.70 శాతం క్షీణించాయని..వాటిలో మోటార్ సైకిళ్లు 3.28 శాతం ఉంటే, స్కూటర్లు 30.25 శాతం ఉన్నట్లు తెలిపింది. టీవీఎస్ సంస్థకు ఊరట కలిగించే అంశమేంటంటే, త్రీవీలర్ వాహనాల విక్రయాలు గతం కంటే 25 శాతం పెరగడం. అంతేకాకుండా ఎగుమతులు సైతం 25 వరకూ పెరిగినట్లు సంస్థ ప్రకటించింది.
Tags: TVS, tvs Motor Company, Two wheeler, tvs units, TVS Motor