రాజకీయాల్లోకి కత్తి కార్తీక

by Shyam |   ( Updated:2020-09-01 05:51:43.0  )
రాజకీయాల్లోకి కత్తి కార్తీక
X

దిశ, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వినాయకుల నిమజ్జనం సందర్భంగా టీవీ యాంకర్ కత్తి కార్తీక సందడి చేసింది. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి సరదాగా గడిపింది. దుబ్బాక
మున్సిపాలిటీలోని అన్ని మండపాలను సందర్శించి, పూజలు చేశారు.

అనంతరం మీడియాతో కత్తి కార్తీక యువత భక్తి భావంతో విగ్రహాలను ఏర్పాటు చేయడం సంతోషించతగ్గ అంశమని కొనియాడారు. సమాజంలో ఉన్న చెడును విడిచిపెట్టి మంచిని స్వీకరించాలని యువతకు సూచించారు. ఈ సందర్భంగా వచ్చే దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని వెల్లడించారు. నాకు మద్దతు ఇచ్చి MLAగా గెలిపిస్తే ఒక సైనికురాలిగా సేవాభావంతో పని చేస్తానని నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story