నటిని ప్రేమించిన డైరెక్టర్.. ఆమెకు పెళ్ళైపోయిందని తెలిసి ఏం చేశాడంటే..?

by Anukaran |   ( Updated:2021-04-20 23:29:22.0  )
నటిని ప్రేమించిన డైరెక్టర్.. ఆమెకు పెళ్ళైపోయిందని తెలిసి ఏం చేశాడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: చిత్ర పరిశ్రమ లో వివాహేతర సంబంధాలు అనేవి సర్వ సాధారణం. వాటి వలన వచ్చే గొడవలు కూడా సాధారణంగా మారిపోయాయి. తాజాగా ఒక నటి ని ప్రేమించిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆమెపై దాడికి పాల్పడ్డ ఘటన చెన్నై లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. మనలి బాలాజీ పాళయానికి చెందిన జెన్నిఫర్ ఒక టీవీ నటి. ఆమెకు అంతకు ముందే శరవణన్ అనే వ్యక్తి తో 2019 లో వివాహం జరిగింది. ఈ బంధం ఎన్నో ఏళ్ళు కొనసాగలేదు. కొన్ని విభేదాల కారణంగా వారిద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలోనే విడాకుల కోసం కోర్టు లో అప్పీల్ కూడా చేశారు. ఆ తర్వాత జెన్నిఫర్ ఆమె పనిచేస్తున్న సీరియల్ షూట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న నవీన్ కుమార్ తో ప్రేమలో పడింది. ఆ ప్రేమ కాస్తా పెళ్లి వరకు వచ్చింది.

జెన్నిఫర్ ని త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్న నవీన్ కి ఆమెకు అంతకుముందే పెళ్లయ్యిందనే షాకింగ్ న్యూస్ తెలిసింది. దీంతో ఆమెను నవీన్ నిలదీయడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ రోజు రాత్రి నవీన్ ఫుల్లుగా మద్యం సేవించి, అతని స్నేహితులతో జెన్నిఫర్ ఇంటికి వెళ్లి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై జెన్నిఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నవీన్ ని అతని స్నేహితులు కార్తికేయన్, పాండియన్ లను అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story