పసుపు క్వింటాల్ @ 7658

by Shyam |
పసుపు క్వింటాల్ @ 7658
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పసుపునకు రికార్డు స్థాయిలో ధర పలికింది. ఎర్రగుంటూర్ రకం పసుపు క్వింటాల్‌కు రూ.7658 ధర పలికింది. 19 క్వింటాళ్ల పసుపునకు అదే ధరలో కొనుగోలు జరిగింది. తొలిసారి 1000 క్వింటాళ్ల పసుపునకు రూ.7 వేల పైచిలుకు పలికిందని మార్కెట్ కమిటి కార్యదర్శి విజయ్ కిషోర్ తెలిపారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు ఇప్పటి వరకు ఈ సీజన్‌లో లక్ష క్వింటాళ్ల పసుపు వచ్చింది.

మరో మూడు లక్షల వరకు పసుపు వస్తుందని అధికారులు తెలిపారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో రూ.7 వేల పై చీలుకు ధర పలకడంతో మహారాష్ర్టాలోని సాంగ్లీ మార్కెట్‌కు వెళ్లడానికి వెనుక ముందు ఆలోచిస్తున్నారు. గతేడాది నిజామాబాద్‌లో పసుపునకు ఎప్రిల్ మాసంలో క్వింటాల్‌కు రూ.7678 పలికిందని అధికారులు తెలిపారు. ఈ సారీ పసుపు దిగుమతులు నిలిపి వేయడం, ఈనామ్ ద్వారా ఆన్ లైన్ ట్రేడ్ కారణంగా పసుపునకు క్వింటాల్‌కు రూ.10 వేల ధర పలుక వచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story

Most Viewed