ఎంసెట్ షెడ్యూల్ విడుదల

by Shyam |
ఎంసెట్ షెడ్యూల్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎంసెట్ ఫైనల్ కౌన్సెలింగ్ రీషెడ్యూల్‌ను ఎంసెట్ అడ్మిషన్స్ కన్వీనర్ నవీన్ మిట్టల్ గురువారం విడుదల చేశారు. ఓపెన్ స్కూల్, ఇంటర్ రిలాక్సేషన్ ఇచ్చిన విద్యార్థులు ఈ నెల 31న సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించారు. తుది కౌన్సెలింగ్‌కు ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు నవంబర్ 1న కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నెల 30 నుంచి నవంబర్ 2 వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని కేటగిరీల్లోని విద్యార్థులకు నవంబర్ 4న సీట్ల కేటాయింపు చేపడుతారు. నవంబర్ 4 నుంచి 7వరకూ సెల్ఫ్ రిపోర్టింగ్, ట్యూషన్ ఫీజు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

Advertisement

Next Story