డబుల్ డెక్కర్ బస్సులపై ఆర్టీసీ కీలక నిర్ణయం.. త్వరలో నగరంలో చక్కర్లు!

by Shyam |
double decker bus
X

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులుండేవి అని వినడమే కానీ ఈతరం యువత వాటిలో ప్రయాణించి అనుభూతి పొందలేదు. అయితే, ఆ అనుభూతి మాక్కూడా కావాలంటూ ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీంతో మరోసారి మహానగరంలో తిరిగి డబుల్ డెక్కర్ బస్సును చూడనున్నామని నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. అయితే, దీని గురించి ప్రస్థావన వచ్చి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటివరకు డబుల్ డెక్కర్ బస్సులపై స్పష్టత రాలేదు. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున కొత్తగా.. డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి ప్రారంభిస్తే గిట్టుబాటు అవుతుందా అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి.

అయితే, ఒక్క బస్సు దాదాపు రూ.70 లక్షలు ధర ఉండటంతో ఆర్టీసీ వెనక్కితగ్గుతోంది. అయితే, బస్సులను కొనుగోలు చేసే బదులు అద్దె ప్రాతిపదికన డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అంతేకాకుండా, డబుల్ డెక్కర్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాల్సిన బాధ్యతను అశోక్‌ లేలాండ్‌ కంపెనీకి అప్పగించాలని చూస్తోంది. ఏది ఏమైనా హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులను తిరిగిచూడాలని నగరవాసులు ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story