- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘క్రైస్తవులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలి’
by Shyam |

X
దిశ, హైదరాబాద్: తెలంగాణలో క్రైస్తవులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆలిండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బషీర్బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో సమాఖ్య అధ్యక్షులు జెరూసలేం మత్తయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలలో బీసీ.సీ కోటాను ఐదు శాతానికి పెంచేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తేవాలన్నారు. ఏపీ ప్రభుత్వం మాదిరిగానే తెలంగాణలోనూ పాస్టర్లకు నెలకు రూ.10వేల గౌరవవేతనం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు 13 డిమాండ్ల సాధనకు ఈ నెల 18న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్టు వెల్లడించారు.
Tags: ts government, reservations, christians, basheerbag press clug
Next Story