రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు

by vinod kumar |
corona
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ర్ట వ్యాప్తంగా మరో 427 కరోనా కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. దీంతో కేసుల మొత్తం సంఖ్య 6,51,715 కు చేరుకోగా, డిశ్చార్జ్ ల సంఖ్య 6,40,065పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 68, కరీంనగర్ లో 43 ,వరంగల్ అర్భన్ లో 41, నల్గొండలో 26, మేడ్చల్ లో 28 తేలగా, ఆదిలాబాద్ లో 4, భద్రాద్రి కొత్తగూడెంలో 6,జగిత్యాలలో 16, జనగామ 5,భూపాలపల్లిలో 6,గద్వాలలో 2,కామారెడ్డిలో 2, ఆసిఫాబాద్ లో 4,ఖమ్మం 23 ,మహబూబ్ నగర్ లో 5, మహబూబాబాద్ 6,మంచిర్యాల 15, మెదక్ లో 3, ములుగు లో 4, నాగర్ కర్నూల్ 4, నారాయణ పేట్ లో 2,నిజామాబాద్ లో 6 , పెద్దపల్లి లో 22, సిరిసిల్లా లో 15, రంగారెడ్డి లో 21, సంగారెడ్డి లో 3 , సిద్ధిపేట్ లో 13, సూర్యాపేట్ లో 14, వికారాబాద్ లో 1, వనపర్తి లో 4, వరంగల్ రూరల్ లో 8, యాదాద్రిలో మరో 7 కేసులు చొప్పున నమోదయ్యాయి. కానీ నిర్మల్ జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా రికార్డు కాలేదని ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో ప్రస్తుతం ఆక్టివ్ కేసుల సంఖ్య 7812 కి చేరగా వీరిలో 95 శాతం మంది హోం ఐసోలేషన్ లోనే చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed